కరోనా వైరస్ భారత్ లో రోజు రోజుకి దారుణంగా విజృంభిస్తోంది. వైరస్ దేశంలో ప్రవేశించిన స్టార్టింగ్ రోజుల్లో పాజిటివ్ కేసులు పదుల సంఖ్యలో బయటపడగా తాజాగా వందల్లో నమోదవుతున్నాయి. ఉన్న కొద్దీ దేశంలో కరోనా వైరస్ భయంకరమైన మరణ విలయతాండవం సృష్టించడానికి రెడీగానే ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులు బట్టి తెలుస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ని అరికట్టేందుకు తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నయి. కేంద్రం చెప్పే ప్రతి ఆదేశాలను దేశం లో ఉన్న రాష్ట్రాలు అమలు పరుస్తూ లాక్ డౌన్ చాలా పటిష్టంగా అమలు చేస్తున్నాయి. అయితే అన్ని రాష్ట్రాల తీరు ఒకలా ఉంటే పశ్చిమ బెంగాల్లో మమత సర్కార్ వ్యవహరిస్తున్న తీరు మరోలా ఉంది. కేంద్రం చెప్పే ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా పశ్చిమ బెంగాల్ సర్కార్ వ్యవహరిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కరోనా వైరస్ కట్టడి చేసే విషయంలో మమత సర్కార్ అనేక విమర్శలు ప్రస్తుతం ఎదుర్కొంటోంది. ఐసీఎంఆర్ వంటి కేంద్ర సంస్థ కరోనా వైరస్ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయటంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని రెండుసార్లు హెచ్చరికలు పంపిన మమత సర్కార్ వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదంట. అయితే ఈ విషయంలో ఎక్కడ పొరపాటు జరిగింది అన్నది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.
కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉంటున్న గాని తన రాష్ట్రం గురించి కేంద్రం హైలెట్ గా చూపించడాన్ని మమత బెనర్జీ తట్టుకోవడం లేదట. పశ్చిమ బెంగాల్ లో అంత సీరియస్ గా వైరస్ ప్రబలిన సందర్భాలు లేవని ఇది కేవలం కల్పితం అని..ఈ ఏడాది ఎన్నికలు కాబట్టి తన సర్కార్ ని బయట ప్రపంచానికి బూచిగా చూపించడానికి కేంద్రం ఆడుతున్న డ్రామా అని అందుకే కేంద్రం ఇస్తున్న ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదట. ప్రస్తుతం అయితే పశ్చిమబెంగాల్లో కరోనా వైరస్ చాలా కంట్రోల్ లోనే ఉందని మమతా బెనర్జీ అంటున్నారు.