కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత కాంగ్రెస్ మాజీ రాహుల్ గాంధి తొలి సారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి పలు సూచనలు చేసారు. కరోనా విషయంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా పోరాట౦ చెయ్యాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో కరోనా టెస్ట్ లు చాలా తక్కువగా జరుగుతున్నాయని అన్నారు. కరోనా మళ్ళీ పెరిగిపోయే అవకాశం ఉందని అన్నారు.
ర్యాండంగా పరిక్షలు చెయ్యాలని ఆయన సూచించారు. లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని, లాక్ డౌన్ పూర్తి అయిన తర్వాత తీసుకునే చర్యలపై వ్యూహరచన చెయ్యాలని ఆయన హితవు పలికారు. మోడీ రాష్ట్రాలకు మరిన్ని నిధులు ఇవ్వాలని అన్నారు. కరోనాపై పోరాటం చేసేందుకు మోడీ మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తాను విమర్శలు చేయడం లేదు సూచనలు మాత్రమే చేస్తున్నా అని అన్నారు.
కేరళలో సమర్ధవంతంగా కరోనా ను కట్టడి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అక్కడ పరికరాలు ఎక్కువగా ఉన్నాయన్నారు రాహుల్. వలస కూలీల విషయంలో మరిన్ని చర్యలు తీసుకోవాలని రాహుల్ సూచనలు చేసారు. కాగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 వేలు దాటగా కరోనాతో పోరాడుతున్న వారి సంఖ్య 10 వేలు దాటింది. మరణాలు 400 కి చేరువలో ఉన్నాయి.