హార్దిక్ పాండ్య లేకపోయినా గుజరాత్ టైటాన్స్ కి నష్టం లేదు: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ మార్చ్ 22 న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్కు వెళ్లిపోయినప్పటికీ గుజరాత్ టైటాన్సు వచ్చిన నష్టమేమీ లేదని ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘హార్దిక్ పాండ్య లేకపోయినా గుజరాత్ బలంగానే ఉంది అని అన్నారు. హార్దిక్ పాండ్య నాణ్యమైన ఆల్రౌండర్ కానీ అతడి లోటును గిల్ సేన పూడ్చుకోగలదు’ అని తెలిపారు.

గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక కెప్టెన్గా తప్పుకొన్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, ఆటగాడిగా ఎలాంటి ప్రభావం చూపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news