బరువు తగ్గించేందుకు ఇక కష్టపడక్కర్లేదు.. ట్యాబ్లెట్లు వచ్చేస్తున్నాయ్..!

-

అధిక బరువు అనేది ఈరోజుల్లో అందరికీ కామన్‌గా ఉండే సమస్య అయిపోయింది. బరువు తగ్గాలని చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం చేయడం, డైట్‌ ఫాలో అవడం..ఇక ఈ డైట్లలో అయితే చెప్పలేనన్ని రకాలు. దేనికైనా మాత్ర ఉంది కదా..మరీ ఈ బరువు తగ్గించేందుకు ఎందుకు లేదురా వేసుకుంటే ఓ పని అయిపోతుంది అనుకునేవాళ్లూ ఉన్నారు.. ఇప్పటి వరకూ బరువు తగ్గేందుకు డ్రింక్స్‌ మాత్రమే ఉన్నాయి.. కానీ ఇప్పుడు బరువు తగ్గే ట్యాబ్లెట్‌ కూడా వచ్చింది..ఇక ఎలాంటి వ్యాయామాలు చేయకుండా..ఈ ట్యాబ్లెట్‌ వేసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చట..!

ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ శాస్త్రవేత్తలు సులభంగా బరువు తగ్గడం ఎలా అనే అంశం మీద పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అయితే టెక్సాస్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక ట్యాబ్లెట్‌ను కనిపెట్టారు.

బరువు తగ్గించే మాత్ర..

బరువు తగ్గించే కొత్త చికిత్స‌కు సంబంధించిన ట్రయల్స్ టెక్సాస్‌లో మొదలైంది. ఈ మేరకు ఇంజెక్టబుల్ ప్రొడక్ట్‌ను ఎలుకల మీద ప్రయోగిస్తున్నారు. ఈ మందు పేరు CPACC. ముందుగా కొవ్వు, కేలరీలు, షుగర్స్ ఎక్కువగా ఉన్న ఆహారం ఎలుకలకు ఇచ్చారు. తర్వాత ఆరు వారాల పాటు ప్రతి మూడు రోజులకు ఒకసారి వాటికి ఇంజక్షన్ ఇచ్చారు. ఇలా ఇంజక్షన్లు తీసుకున్న ఎలుకలు బరువు పెరగలేదు. ఈ ఎలుకలకు గుండెజబ్బులు, స్ట్రోక్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గమనించారు.

ఈ పరిశోధకులు ఈ మెడిసిన్‌ను మార్కెట్‌లోకి తేవడానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారట.. అంటే త్వరలోనే ఇది రాబోతుంది.. ఈ సంవత్సరం హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. టెక్సాస్ యూనివర్సిటికి చెందిన ఈ పరిశోధకులు మాట్లాడుతూ.. ఈ పరిశోధన పర్యంతం ఎలాంటి అవాంతరాలు ఏర్పడలేదని, ఇంజెక్షన్ ద్వారా వారానికి రెండు సార్లు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఎలుకల్లో లివర్, గుండె పనితీరు సాధారణంగానే ఉందని ఇప్పుడు ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వాలంటీర్ల కోసం చూస్తున్నామని తెలిపారు.

ఈ మెడిసిన్‌లో ఉపయోగించే కీలకమైన భాగం మెగ్నీషియం. ఇది కణాలలో ఉండే మైటోకాండ్రియాకు నష్టం జరగకుండా నివారిస్తుంది. ఎక్కువ కొవ్వు కలిగిన ఆహారం తీసుకున్నప్పటికీ శరీరంలో కొవ్వు నిల్వలు పెరగకుండా ఉండడం ఈ పరిశోధన విజయంగా మారింది.. ఈ మాత్ర పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందనేది ఇంకా స్పష్టంగా చెప్పలేదు. అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని మార్కెట్లోకి వచ్చేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. వన్స్‌ ఇది మార్కెట్‌లోకి వస్తే రిజల్ట్‌ ఎలా ఉంటుందో.. ఇంక ఊభకాయలు అనే మాటే ఉండదేమే..!

Read more RELATED
Recommended to you

Latest news