మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు సార్.. చంద్రబాబుకు వినతులు!

-

ఆంధ్రాలో తుపాను ధాటికి విజయవాడ,గుంటూరు, అమరావతి, రాజధానిలోని పలు ప్రాంతాలు భారీగా నీటమునిగాయి.దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లల్లోకి మొత్తం నీరు చేరడంతో రాత్రంతా నిద్రలేకుండా జాగారం చేసినట్లు సమాచారం. వరదలు ఒక్కసారిగా విజయవాడను ముంచెత్తడంతో అక్కడి ప్రజలు బిల్డింగ్ పైకి చేరుకుని రక్షించాలని వేడుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కొందరిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించగా..మరికొందరు ప్రజలు ఇప్పటికే ముంపు ప్రదేశాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బోటు ద్వారా పర్యటించి అక్కడి బాధితుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.అందరికీ ప్రభుత్వం తరఫున సాయం చేయడంతో పాటు అండగా ఉంటామని వారికి భరోసా కల్పిస్తున్నారు. బోట్లపై తిరుగుతూ సహాయక చర్యలు అందుతున్న విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు బాబు ప్రయాణిస్తున్న బోటు దగ్గరకు వచ్చి తమకు న్యాయం చేయాలని, ఎవరూ పట్టించుకోవడం లేదని విన్నవించారు.‘ మా ఏరియాలో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చాయి. అక్కడ జనాలు చాలా మంది ఉన్నారు. ఎవరూ సహాయం చేయడానికి రాలేదు. తాగునీళ్లు, తిండి లేదని చెప్పగా.. వారికి సీఎం ధైర్యం చెప్పి సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news