టీమిండియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఇటీవల విరాట్ కోహ్లి తప్పకున్న విషయం తెలిసిందే. అయితే విరాట్ కోహ్లి తర్వాత టీమిండియా టెస్టు క్రికెట్ కెప్టెన్ ఎవరా అనే ప్రశ్న అప్పుడే మొదలైంది. తాజా గా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా కూడా టెస్టు క్రికెట్ కెప్టెన్సీ పై స్పందించాడు. సౌత్ ఆఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ కు ముందు బుమ్రా మీడియాతో మాట్లాడారు. తనకు టెస్టు క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే.. గొప్ప వరంలా భావిస్తానని అన్నారు.
అలాగే అలాంటి అవకాశం వస్తే.. ఏ ఆటగాడూ వదులకోరని అన్నారు. అది గొప్ప గౌరవంలా భావిస్తారని అన్నారు. తాను కూడా అందుకు మినహాయింపు కాదుని అన్నారు. అయితే టెస్టు క్రికెట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పకోవడం తనను షాక్ కు గురి చేసిందని అన్నాడు. అలాగే విరాట్ కోహ్లి కెప్టెన్సీ అద్భుతంగా ఉంటుందని తెలిపారు. అందుకే ఇన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడని అన్నారు. అయితే తాను కూడా టెస్టు క్రికెట్ లో అడుగు పెట్టింది విరాట్ కోహ్లి సారథ్యంలోనే అని అన్నాడు.