అక్షర్‌ పటేల్‌ కు షాక్‌ : టీ 20 వరల్డ్‌ కప్‌ జట్టులోకి శార్దూల్‌ ఠాకూర్‌

అక్టోబర్‌ 17 వ తేదీ నుంచి టీ 20 ప్రపంచ కప్‌ టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే… అక్టోబర్‌ 17 నుంచి టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ స్థానంలో భారత ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఎంపిక చేసింది భారత క్రికెట్‌ కౌన్సిల్‌. అక్షర్‌ పటేల్‌ స్థానంలో శార్దూల్‌ ను మెయిన్‌ టీంలోకి తీసుకుంది బీసీసీఐ.  ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది భారత క్రికెట్‌ కౌన్సిల్‌.

మొన్న ప్రకటించిన జట్టు లో శార్దూల్‌ ఠా కూర్‌ స్టాండ్‌ బై ప్లేయ ర్‌ గా ఉండగా… అతని ఆట తీరుతో అక్షర్ పటేల్ స్థానంలో మెయిన్‌ టీంకు ఎంపిక చేసింది బీసీసీఐ. అలాగే.. అక్షర్‌ పటేల్‌ ను స్టాండ్‌ బై ప్లేయర్‌ గా మార్చుతూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. హర్ధిక్‌ పటేల్‌ కు ఒక వేళ ఇంజూరీ అయితే.. శార్దూల్‌ ఠాకూర్‌ ను జట్టులోకి తీసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. కాగా.. ఇవాళ టీం ఇండియా కొత్త జెర్సీ ని బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే.