ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ ఊరట కలిగించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏ కేటగిరీలోనూ చార్జీలను పెంచాలని డిస్కమ్ లు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు.
ఏటా ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమలులోకి రావడం ఆనవాయితీ. పేదలు మినహా అన్ని వర్గాల వినియోగదారులపై ఎంతో కొంత పెంపు సాధారణంగా ఉంటుంది. అయితే అనూహ్యంగా ఈ దఫా చార్జీలు పెంచాలని డిస్కమ్ లు ప్రతిపాదించలేదు. దీంతో విద్యుత్ వినియోగదారులపై వచ్చే ఏడాది విద్యుత్ ఛార్జీల భారం ఉండదని స్పష్టమైంది.