అక్కడ రీపోలింగ్ అక్కర్లేదు.. తేల్చేసిన ఎన్నికల కమిషన్ !

-

రెండు చోట్ల రీ పోలింగ్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల కమీషన్ కి తెలంగాణ హైకోర్టు సూచించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్న సంగతి తెలిసిందే. పురానా పూల్, ఘాన్సీ బజార్ లో రీ పోలింగ్ నిర్వహించాలని, అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు.

అయితే పురాణపుల్, ఘాన్సీ బజార్ లలో రిపోలింగ్ అవసరం లేదని కోర్టుకు రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.  పూరణపుల్, ఘాన్సీ బజార్ డివిజన్లలోని పలు పోలింగ్ కేంద్రాల్లో చివరి గంటల్లో అనూహ్యంగా ఓటింగ్ పెరిగిందని, రెండు డివిజన్లలో రిపోలింగ్ నిర్వహించాలని న్యాయస్థానాన్ని బీజేపీ ఆశ్రయించింది. దీంతో ఇక్కడ అలాంటి అవకతవకలు ఏమీ జరగలేదని, ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. 

Read more RELATED
Recommended to you

Latest news