ఏపీ ఉద్యోగులకు మళ్లీ నిరాశే మిగిలింది. ఎప్పటి లాగే, 10 వ తేదీ దాటినా.. జీతాలు అందలేదు. కొత్త ఏడాదిలో సమయానికి జీతాలు వస్తాయని ఊహించిన ఉద్యోగులకు, పెన్షనర్లకు నిరాశే మిగిలింది. ఇంకా జీతాలు అందలేదు.

అటు ప్రతి మంగళవారం ఆర్బిఐ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతి దక్కకపోవడంతో, ఇవాళ రుణం పొందే అవకాశం లేదు. దీంతో జీతాలు, పెన్షన్ల చెల్లింపు కోసం ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. అటు జీతాలు, పెన్షన్లు ఎప్పుడు పడతాయోనని ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు 60 శాతం మంది ఉద్యోగులకు జీతాలు అందినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక త్వరలోనే మిగతా ఉద్యోగులకు అందుతాయని చెబుతున్నారు.