ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. డిసెంబర్ నెల మొదలై పది రోజులు గడిచిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, అలాగే పెన్షనర్లకు పెన్షన్లు అందలేదు. పది రోజులు గడిచిన తమకు జీవితాలు పడలేదని ఏపీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకటో తేదీన ఈఎంఐ లు కట్టుకోవాల్సిన తాము ఇంకా కట్టలేదని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు అందక బ్యాంకు లోన్లు సకాలంలో చెల్లించలేక డిఫాల్టర్ గా మారే పరిస్థితి ఏర్పడిందని వారు తెలుపుతున్నారు. ఉపాధ్యాయ వర్గాన్ని కావాలనే ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తోందని, నెల రోజులు కష్టపడి పని చేసినా ఒకటో తేదీన జీతాలు రావడం లేదని జగన్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.