SLBC టన్నెల్ ప్రమాదంలో అదృష్టవశాత్తు 42 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడగా.. మరో 8 టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు. ప్రస్తుతం వారిని కనిపెట్టేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోపలికి వెళ్తున్న కొద్దీ వరద నీరు, బురద భారీగా పేరుకుపోవడంతో బృందాలు లోనికి వెళ్లేందుకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచిపోవడంతో లోపల ఉన్న వారు బతికే ఉన్నారా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆక్సిజన్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఇదిలాఉండగా, టన్నెల్‌లో పనిచేస్తున్న కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వడం లేదని టాక్ వినిపిస్తోంది. ప్రాణాలు పణంగా పెట్టి టన్నెల్‌లో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు కూడా ఇవ్వరా? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
https://twitter.com/pulsenewsbreak/status/1894229694431519070