నో సంక్రాంతి ఎఫెక్ట్ : హైదరాబాద్ – విజయవాడ హైవే ఖాళీ !

-

సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారిపోయేది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరేవి. హైదరాబాద్ విజయవాడ మధ్య 2 టోల్గేట్ ప్లాజాలు ఉండగా ఆ రెండు టోల్గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతూ ఉండేవి. కానీ ఈ ఏడాది సంక్రాంతి  సందడి ఏమీ పెద్దగా కనిపించడం లేదు. కరోనా కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయి సొంత ఊరిలోనే ఉండిపోవడంతో సొంత ఊళ్లకు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గింది.

ఇక హైదరాబాద్ నుంచి ఆంధ్రకి వెళ్లే వారిలో ఎక్కువగా సాఫ్టువేర్ ఇంజనీర్ లు ఉండేవాళ్ళు ఇప్పుడు వారంతా వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ తీసుకుని స్వంత ఊరు నుంచి పని చేస్తూ ఉండడంతో దాదాపుగా వారి రద్దీ కూడా తగ్గిందని భావించ వచ్చు. అంతే కాక ఫాస్టాగ్ అనే ఆప్షన్ను కేంద్రం ప్రవేశపెట్టడంతో దాదాపుగా కారులు ఏవీ టోల్ ప్లాజా వద్ద ఎక్కువ సేపు ఆగడం లేదు. రద్దీ తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news