నో స్మోకింగ్ డే: అలవాటుని మానాలంటే కావాల్సిన కొన్ని ట్రిక్స్..

-

పొగత్రాగడం అనేది అంత తొందరగా పోయే అలవాటు కాదు. క్రమం తప్పకుండా పొగ త్రాగేవారు దాన్ని వదిలిపెట్టి ఉండలేరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం చెందుతూ ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం పొగ తాగడం వల్ల సంవత్సరానికి 8మిలియన్ల మంది చనిపోతున్నారు. అందులో 7మిలియన్ల మంది డైరెక్టుగా పొగతాగడం వల్ల చనిపోతే మిగతా 1 మిలియన్ల మంది మాత్రం పొగ తాగేవారితో స్నేహం చేయడమో, సిగరెట్ తాగకపోయినా పరోక్షంలో పొగ పీల్చడం కారణం చనిపోతున్నారు.

 

సిగరెట్ లో ఉండే నికోటిన్ డైరెక్టుగా మెదడు మీద ప్రభావం చూపి డోపమైన ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల మనసంతా తేలుతున్నట్టు ఉంటుంది. అది ఎక్కువ అవడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బంది. అప్పుడప్పుడు పొగ తాగేవారు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అధ్యయనం సమాచారం. మరి ఈ చెడ్డ అలవాటును మానాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

ముందుగా మానాలనుకున్నప్పుడు ఒక పెన్ను పేపరు తీసుకోండి. డేట్ వేయండి. మొక్కుబడిగా కాకుండా ఒక శపథంగా తీసుకోండి. మీరు పొగ తాగడం వల్ల మీకు, మీ వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయో తెలుసుకోండి. మీ పిల్లల ఆరోగ్యం, మీ భాగస్వామి జీవితం, ఇంకా మీ పర్సనల విషయాల్లో ఇబ్బందులన్నీ పేపర్ మీద రాయండి. సిగరెట్లు మానడం వల్ల ఎంత డబ్బు ఆదా అవుతుందో లెక్కలేయండి. అనుకుంటారు గానీ సిగరెట్ తాగకపోతే చాలా డబ్బు జమ అవుతుంది.

సిగరెట్ మానేస్తున్నాననే విషయం మీ భార్యకి, పిల్లలకి, మీ స్నేహితులకి, సహోద్యోగులకి చెప్పండి. అలా చెబితే మీకు మళ్ళీ తాగాలనిపించినా వారు గుర్తొచ్చి ఆగిపోయే అవకాశం ఉంది. సిగరెట్ మానేస్తున్నారు, దాని స్థానంలో కొత్త మంచి అలవాటు పెంపొందించుకోండి. అది మీకు సరికొత్త జీవితాన్ని చూపించాలి.

Read more RELATED
Recommended to you

Latest news