తెలంగాణాలో 18 ఏళ్ళు దాటిన వారికి వాక్సిన్ ఇవ్వడంలేదు: ప్రభుత్వం

తెలంగాణాలో తమకు లాక్ డౌన్ విధించే ఆలోచనే లేదని మంత్రి ఈటల రాజేంద్ర స్పష్టం చేసారు. 18 ఏళ్ళు నిండిన వారికి తెలంగాణాలో మే 1 నుంచి వాక్సిన్ ఇవ్వడం లేదని ఆయన ప్రకటించారు. మే 1 నుంచి 18 ఏళ్ళు దాటిన వారికి వాక్సిన్ ఇవ్వాలి అంటే 3.5 కోట్ల డోస్ లు కావాలని ఆయన అన్నారు. కేంద్రం కేటాయించే వాక్సిన్ ల బట్టే తెలంగాణాలో వాక్సినేషన్ జరుగుతుందని అన్నారు.

minister etala
minister etala

కొన్ని విషయాల్లో కేంద్ర స్పందన ఏ మాత్రం బాగా లేదని ఆయన పేర్కొన్నారు. ఎక్కువ ధరకు కరోనా మందులను విక్రయించే వారిపై కఠినంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఆక్సీజన్ సరఫరాను కేంద్రం నియంత్రించడం కాదు రాష్ట్రాల కొరత తీర్చాలని ఆయన విజ్ఞప్తి చేసారు.