జుట్టును బలంగా మార్చుకోవడానికి, మసాజ్ అత్యుత్తమైన మార్గం.. ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి.

-

జీవనశైలిలో మార్పుల కారణంగా జుట్టు రాలిపోవడం, బలహీనంగా మారిపోవడం సాధారణం అయిపోయింది. పెరుగుతున్న కాలుష్యం, తీసుకుంటున్నా ఆహారం మనుషుల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. తెల్ల జుట్టు ఏర్పడటం, జుట్టు విఛ్ఛిన్నం అయిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి వాటిని దూరం చేసుకోవాలంటే జుట్టుకి బలాన్ని సమకూర్చుకోవాలి. జుట్టుకి బలం అందించడం కోసం చేసే అన్ని రకాల ప్రక్రియల్లో మసాజ్ చాలా ఉత్తమమైనది. ఆయిల్ మసాజ్ జుట్టుకి ఆరోగ్యాన్ని అందిస్తుంది. మసాజ్ వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం.

నెత్తికి మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. దానివల్ల కుదుళ్ళకి అవసరమైన పోషణ అందుతుంది. శరీరానికి తిండి ఎలా అవసరమో, జుట్టుకి మసాజ్ అలా అవసరం.

మసాజ్ కారణంగా చుండ్రు తగ్గుతుంది. ముఖ్యంగా పొడిచర్మం ఉన్నవారికి చుండ్రు ఎక్కువగా అవుతుంది. దాన్ని నివారించాలంటే మసాజ్ చేయడం తప్పనిసరి. దానివల్ల నెత్తిపై తేమ ఉత్పత్తి అయ్యి చుండు కాకుండా ఉంటుంది.

మసాజ్ వల్ల జుట్టు రాలే సమస్య ఉండదు. జుట్టు మృదువుగా మారి మెరిసేదిగా మార్చడంలో మసాజ్ కీలక పాత్ర వహిస్తుంది.

తెల్లబడే జుట్టును నిరోధించడంలో మసాజ్ బాగా పనిచేస్తుంది. వయసు కారణంగా జుట్టు తెల్లబడితే పెద్ద సమస్య లేదు కానీ, యువతలోనూ కనిపిస్తున్న తెల్లజుట్టును మసాజ్ నివారిస్తుంది.

మసాజ్ ఎలా చేసుకోవాలంటే,

వేడినూనెతో మసాజ్ చేయడం మంచిది. మీకు తగిన నూనె తీసుకోండి.
మీ వేలు భరించగలిగినంత వేడికాగానే పొయ్యి మీద నుండి దించేయండి. ఎక్కువ సేపు వేడిచేస్తే పోషకాలు తగ్గిపోతాయి.
ఇప్పుడుమీ మునివేళ్ళకి నూనెని అంటించుకుని మసాజ్ చేయండి.
10-15నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత ఒక గంటపాటు అలాగే వదిలేయండి.
ఆ తర్వాత షాంపూ, కండీషనర్ తో శుభ్రం చేసుకుంటే చాలు.

Read more RELATED
Recommended to you

Latest news