అంతర్వేది లక్ష్మి నరసింహా స్వామి రధం దగ్ధం నేపథ్యంలో అంతర్వేది లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఏలూరు రేంజ్ డిఐజి ఆదేశాలు మేరకు సఖినేటిపల్లి మండలం అంతర్వేది పరిసల ప్రదేశాలలో సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. సెక్షన్ 30 అమలులో ఉన్నందున ఇతరులను గ్రామంలోకి అనుమతించని పోలీసులు… ఎవరు అయినా వస్తే ఆధారాలు చూపించి రావాలి అని సూచనలు చేస్తున్నారు.
యాక్ట్ ఉల్లంఘిస్తే వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ దిశగా ఆంక్షలు విధించారు. అంతర్వేది గ్రామం చుట్టూ భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసారు. హిందుత్వ సంస్థలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యవహారంపై మండిపడుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక రాష్ట్ర ప్రభుత్వ కుట్ర ఉంది అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకోవాలని హిందుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.