నూడుల్స్‌ను అధికంగా తింటే బరువు పెరుగుతారని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. నూడుల్స్‌లో ట్రాన్స్‌ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందట.
మనలో అధిక శాతం మందికి జంక్ ఫుడ్ తినడం అంటే ఇష్టమే. కొందరు రోడ్డు పక్కన దొరికే తినుబండారాలు, నూనె పదార్థాలు తింటారు. ఇక మరికొందరు బేకరీ పదార్థాలు తింటారు. నిజానికి వన్నీ జంక్ ఫుడ్సే. వీటిని తినడం మానేయాలి. లేదా చాలా తక్కువగా.. ఎప్పుడో ఒకసారి మాత్రమే తినాలి. అయితే ఇవే కాకుండా ఇంకా కొందరు నూడుల్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ముందు చెప్పిన జంక్ ఫుడ్ కన్నా నిజానికి నూడుల్సే మనకు ఎక్కువ హాని కలిగిస్తాయట. అవును, ఇది నిజమే.
నూడుల్స్‌ను అధికంగా తింటే బరువు పెరుగుతారని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. నూడుల్స్‌లో ట్రాన్స్‌ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందట. అందువల్లే వాటిని తింటే శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరుగుతుందట. దీంతో బరువు పెరుగుతారని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక నూడుల్స్‌ను వండేటప్పుడు వేసే పదార్థాల్లోనూ మన శరీరానికి హానికరమైన రసాయనాలను కలుపుతారట. అందువల్ల నూడుల్స్‌ను తినడం చాలా ప్రమాదకరమని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా నూడుల్స్‌ను చాలా మంది ఇప్పుడు తింటున్నారు. ఇక కొందరు తల్లిదండ్రులైతే చాలా త్వరగా అవుతాయని చెప్పి నూడుల్స్‌ను పిల్లలకు చేసి పెడుతుంటారు. అయితే మనం బయట తినే నూడుల్స్ మాత్రమే కాదు, ఇంట్లో చేసుకునే నూడుల్స్ అయినా సరే.. మనకు అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయని, కనుక వాటికి వీలైనంత దూరంగా ఉండడమే మంచిదని.. వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నూడుల్స్ తినేవారు.. జాగ్రత్త.. ఇకనైనా డాక్టర్లు చెబుతున్న సూచనలు పాటించండి. మీ, మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!