సాధారణంగా మనదేశంలో క్రికెట్ అంటే ఒక పిచ్చి. క్రికెట్ ని మతంగా చూస్తారు అభిమానులు. దేశం మొత్తం ఇదే పిచ్చి ఉంటుంది అభిమానులకు. చిన్నా పెద్ద క్రికెట్ ని ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు. అందుకే మన దేశంలో క్రికెట్ కి అంత ఆదరణ ఉంటుంది. క్రికెటర్లు దేవుళ్ళు అయ్యారు. సచిన్, గంగూలీ, ద్రావిడ్, యువరాజ్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఇలా ఎందరో ఆటగాళ్లకు భక్తులు కూడా ఉన్నారు.
అయితే ఒక మ్యాచ్ ఆడి మరో మ్యాచ్ ఆడకపోతే మాత్రం మన వాళ్ళు చేసే అతి అంతా ఇంతా కాదు. టీం విషయం పక్కన పెట్టి కోహ్లీ విషయానికి వచ్చి చూద్దాం. ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న కోహ్లీ ఫాం లో లేక ఇబ్బందులు పడుతున్నాడు. గత 19 మ్యాచుల్లో అతను ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఆరు అర్ధ సెంచరీలు మాత్రమే చేసాడు. ఇటీవలి కాలంలో అతను సెంచరీ చేయకుండా ఉన్న వన్డే సీరీస్ ఒక్కటి అంటే ఒక్కటి కూడా మనం చూడలేదు.
ఇప్పుడు ఇదే ఫాన్స్ కి ఆగ్రహం తెప్పిస్తుంది. కోహ్లీ వేస్ట్ అంటూ మాట్లాడుతున్నారు అభిమానులు. కోహ్లీ కంటే స్మిత్, విలియంసన్, సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ బెస్ట్ అంటూ పొగుడుతున్నారు. బహుసా ఇంత వరస్ట్ అభిమానులు ఏ దేశానికి ఉండరేమో అని అంటున్నారు పలువురు. వాస్తవానికి కోహ్లీ స్థాయిలో ఆడే ఆటగాడిని ఈ మధ్య కాలంలో క్రికెట్ చూడలేదు. అవును క్రికెట్ అసలు అలాంటి ఆటగాడిని ఈ మధ్య కాలంలో చూడలేదు.
తన 11 ఏళ్ళ అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ ఆడలేదు అనే పేరు ఎప్పుడూ లేదు. అతను ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచులు, టీం పరువు కాపాడిన మ్యాచులు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఏదో ఒక్క సీరీస్ ఆడలేదని, ఏదో ఒక సెంచరీ చేయలేదని మాట్లాడుతూ అతన్ని అవమానిస్తున్నారు. ఎందరో ఆటగాళ్ళు కెప్టెన్ అయ్యాక ఆడలేకపోయారు. ధోని లాంటి ఆటగాళ్ళు కూడా అలాగే ఇబ్బంది పడ్డారు. కాని కోహ్లీ లాంటి ఆటగాడిని ఈ విధంగా అవమానించడం ఎంత వరకు భావ్యం కాదు.