కోమాలోకి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్

-

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నట్లు దక్షిణ కొరియా అధికారి ఒకరు వెల్లడించారు. తన సోదరి కిమ్ యోంగ్ ఉన్​కు కొన్ని అధికారాలు కట్టబెట్టిన అనంతరం ఆయన ఆరోగ్యం విషమించినట్లు పేర్కొన్నారు. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డై జంగ్ సహచరుడే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు వెల్లువెత్తాయి. తీవ్రంగా జబ్బుపడి మరణించారన్న కథనాలు కూడా వచ్చాయి. అయితే కొద్దిరోజుల తర్వాత ఓ ఫ్యాక్టరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అయినప్పటికీ ఈ వదంతులకు అడ్డుకట్టపడలేదు. కిమ్ సోదరి ఆయన తరపున అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ మధ్య కిమ్ ఆహారం విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజలు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు శునకాలను లాక్కుంటున్నారు ఉత్తరకొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్. వాటిని ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరకొరియా, దక్షిణ కొరియాలో రెస్టారెంట్లలో శునకాల మాంసంతో చేసిన వంటకాలు రుచికరంగా ఉంటాయట. ప్రస్తుతం ఉత్తరకొరియాలో ఆహార సరఫరాలో సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభానికి కూడా కిమ్‌.. ప్రజలతోనే పరిష్కారం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news