వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూసూద్ తన సొంత ఖర్చులతో పంపించిన విషయం తెలిసిందే. అలాగే కోరిన వారికి సాయం చేస్తూ.. ఈ కరోనా కష్ట కాలంలో అండగా నిలుస్తూ.. మానవత్వం చాటుకుని రియల్ హీరోగా పేరుతెచ్చుకున్న సోనూసూద్ తాజాగా.. తాను ప్రారంభించిన ‘ప్రవాసీ రోజ్‌గార్’ పోర్టల్ ద్వారా 20 వేల మంది వలస కార్మికులకు నోయిడాలో ఉద్యోగాలు కలిపించాడు.
I am delighted to now offer accommodation for 20,000 migrated workers who have also been provided jobs in garment units in #Noida through @PravasiRojgar. With the support of #NAEC President Shri Lalit Thukral, we will work round the clock for this noble cause 😇 @lalit_thukral pic.twitter.com/XejomrrPaL
— sonu sood (@SonuSood) August 24, 2020
అంతేకాదు వారికి తగిన సౌకర్యాలతో అక్కడే నివాసం కూడా కల్పించనున్నట్లు సోను సూద్ వెల్లడించారు. ‘ఇళ్లతో పాటు ఉద్యోగం కల్పిస్తానని నా వాగ్దానం’ అంటూ సోను సూద్ ట్వీట్ చేశారు. అలాగే మహారాష్ట్రలోని సింధూ దుర్గ్ కు చెందిన స్వాప్నిల్ అనే విద్యార్ధిని ఆన్‌లైన్ క్లాసెస్ కోసం ఊళ్లో సిగ్నల్ రాకపోవడంతో సోదరుడితో కలిసి 2 కి.మీ ల దూరంలోని కొండపైకి వెళ్లి చిన్నగుడిసె వేసుకుంది.
Kindly find her details.
WiFi will reach her village. https://t.co/hyndhC235y— sonu sood (@SonuSood) August 23, 2020
రోజంతా వర్షాలు పడుతున్నా కూడా అక్కడే కూర్చొని ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతోంది. దీంతో ఆమె బాధని అర్ధం చేసుకున్న సోనూసూద్ ఆ ఊరికి వైఫై సౌకర్యం కల్పిస్తానని అభయమిచ్చాడు.