ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే నటీమణులకు వేధింపులు అనేవి కొత్తేమీ కాదు. అయితే కొంతమంది అవకాశాల కోసం వాటిని భరిస్తూ దూసుకుపోతుంటే.. మరికొంతమంది వేధింపులను తట్టుకోలేక ఇండస్ట్రీకి కూడా దూరం అవుతున్నారు. ఇకపోతే గతంలో చాలామంది హీరోయిన్లు మర్యాద పోతుందేమో.. అవకాశాలు రావేమో అన్న ఆలోచనతో వేధింపులను కూడా తట్టుకొని జీవితంలో ముందడుగు వేసిన వారు ఉన్నారు . కానీ కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరిలో మార్పు వస్తున్న నేపథ్యంలో మీటూ వంటి ఉద్యమాలు ఊపందుకున్నాయి . ముఖ్యంగా ఇలాంటి ఉద్యమాలు వచ్చిన తర్వాత చాలామంది అమ్మాయిలకు స్వేచ్ఛ ఏర్పడిందని చెప్పవచ్చు. కానీ ఇటువంటి అవకాశాలను కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నట్లు కూడా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఒక వ్యక్తి తనతో సహజీవనం చేయాలి అని , ఒక నటిపై పూర్తిగా ఒత్తిడి చేస్తున్నాడట. ఇక ఆ నటి దగ్గర ఇతను అప్పు కూడా చేసినట్లు సమాచారం. ఇక తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ఇలా వేదిస్తున్నాడు అంటూ.. ఆ నటి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే హైదరాబాదులోని అమీర్ పేట్ .. నాగార్జున నగర్ కాలనీలో 42 సంవత్సరాల వయస్సు వున్న నటి అక్కడే జీవిస్తోంది. అతను బిల్డర్ అని తెలుస్తోంది.
ఇక 8 సంవత్సరాల క్రితం ఈ నటి దగ్గర ఆయన సుమారుగా 47 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడట. ఇక ఆ నటి కూడా అపార్ట్మెంట్లో ఉండే ఇంకో మహిళ దగ్గర అప్పు తీసుకొని మరీ ప్రవీణ్ కు అప్పు ఇచ్చిన డబ్బులు తీసుకొని చాలా ఏళ్లు గడిచిపోయింది. ఇప్పటికైనా తిరిగి ఇవ్వమని అతనికి ఈమె ఫోన్లు చేసి అడుగుతుంటే అతను మాత్రం..ఉప పత్ని గా ఉండమని అసభ్యకరమైన మెసేజ్లు కూడా చేస్తున్నాడట. ఇక అతడి వేదింపులు తట్టుకోలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. కానీ నిందితుడు మాత్రం చాలా వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నాడు. పోలీసులు ఈ విషయంపై ఎలా క్లారిటీ ఇస్తారో తెలియాల్సి ఉంది.