కరోనా వైరస్ జనాల్లో తీవ్రమైన భయాందోళనలను కలిగిస్తోంది. ఇంటి నుంచి కాలు బయట పెడుతున్నామంటే.. ఎక్కడ కరోనా అంటుకుంటుందోనని భయపడాల్సి వస్తోంది. దీంతో జనాలు అన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ ఇళ్ల నుంచి బయటకు వెళ్తున్నారు. అయితే కరోనా కారణంగా నెలకొంటున్న భయాలకు తోడు.. అనేక మంది రాత్రి పూట నిద్ర సరిగ్గా పోవడం లేదు. అలాంటి వారు కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే నిద్ర చక్కగా వస్తుంది. అందుకు ఏం చేయాలంటే…
* నిత్యం ఒకే టైముకు నిద్రపోయేలా చూసుకోండి. రోజూ రాత్రి ఒకే సమయానికి నిద్రించేలా ప్లాన్ చేసుకోండి. దీని వల్ల కొద్ది రోజులకు ఆ లైఫ్ స్టయిల్ అలవాటు అవుతుంది. ఈ క్రమంలో నిత్యం ఆ సమయానికి మీకు నిద్ర కచ్చితంగా వస్తుంది. దీని వల్ల నిద్ర సరిగ్గా పోవచ్చు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
* చాలా మంది రాత్రి పూట బెడ్‌పై కూర్చుని కూడా పనిచేస్తుంటారు. ల్యాప్‌టాప్‌ల వంటి పరికరాలపై పనిచేస్తుంటారు. అలా చేయడం మానుకోవాలి. బెడ్ మీదకు చేరుకున్నామంటే.. నిద్రించేలా ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల బెడ్ పైకి చేరగానే సహజంగా నిద్ర వస్తుంది. బెడ్‌పై పనిచేయడం మానుకోవాలి.
* కొందరు మధ్యాహ్నం విపరీతంగా నిద్రిస్తుంటారు. అలాంటి వారికి రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు. అలాంటి వారు మధ్యాహ్నం నిద్రించడం మానేయాలి. కేవలం శారీరక శ్రమ చేసేవారు, చిన్నారులు, వృద్ధులు మాత్రమే మధ్యాహ్నం నిద్రించాలి. మధ్యాహ్నం నిద్రించడం వల్ల రాత్రి సరిగ్గా నిద్రరాదు. ఆ అలవాటును మానుకుంటే రాత్రి పూట సరిగ్గా నిద్రించవచ్చు.
* నిత్యం యోగా, వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. మెదడును యాక్టివ్‌గా ఉంచాలి. పజిల్స్, సుడోకు వంటి మెదడుకు మేత పెట్టే పనులు చేయాలి. దీంతో మెదడు, శరీరం, మనస్సు అన్నీ యాక్టివ్‌గా ఉంటాయి. రాత్రి అయ్యే సరికి టైముకు నిద్ర కూడా వస్తుంది. ఇలా నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
* నిత్యం సరైన పోషకాలతో కూడిన ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల నిద్ర చక్కగా పడుతుంది. రాత్రి పూట మద్యం సేవించరాదు. కెఫీన్ ఉండే కాఫీ, టీలను తాగరాదు. రాత్రి పూట నిద్రించడానికి సుమారుగా 2 గంటల ముందు వరకు ఆహారాలను తీసుకోవడం మానేయాలి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. దానికి ఆటంకం కలగకుండా ఉంటుంది. అలాగే నిద్రలేమి సమస్య పోతుంది.
* రాత్రి పూట బెడ్‌పై పడుకుని చాలా మంది ఫోన్లతో కాలక్షేపం చేస్తుంటారు. అలా చేస్తే కళ్లపై ప్రభావం పడడమే కాదు.. నిద్రలేమి సమస్య వస్తుంది. దీర్ఘకాలంలో నిద్ర సరిగ్గా పట్టదు. అందువల్ల బెడ్‌పై ఆయా డివైస్‌ల వాడకాన్ని తగ్గించాలి. దీంతో టైముకు నిద్రపోవచ్చు.
* శ్వాస వ్యాయామాలు చేయడం, యోగా, మెడిటేషన్ చేయడం, చక్కని సంగీతం వినడం, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పుస్తకాలు చదవడం, మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడం.. తదితర పనులు చేయడం వల్ల శరీరం కూడా రిలాక్స్ అవుతుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. నిద్ర సరిగ్గా పడుతుంది.
* నిత్యం తగినంత విటమిన్ డి అందేలా చూసుకోవాలి. నిద్ర సరిగ్గా పట్టాలంటే శరీరంలో విటమిన్ డి స్థాయిలు తగినంత ఉండాలి. విటమిన్ డి మన శరీరంలో సర్కేడియన్ రిథమ్‌ను క్రమబద్దీకరిస్తుంది. అందువల్ల శారీరక, మానసిక రుగ్మతలు తగ్గుతాయి. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. నిత్యం రాత్రి పూట టైముకు నిద్రపోవచ్చు.