ఏపీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ధర్మాన కృష్ణదాస్ ఎన్నుకోబడిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ఉపముఖ్యమంత్రి గా ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇకపై నాలుగేళ్లపాటు చెల్లుబాటు అయ్యే విధంగా తొలి సంతకం చేశారు ధర్మాన . అంతేకాకుండా తెల్లరేషన్ కార్డుదారులకు కూడా శుభవార్త అందించారు, ఇక నుంచి బియ్యం కార్డు ఉన్నవారందరికీ ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదు అంటూ ఆయన స్పష్టం చేశారు.
బియ్యం కార్డునే ప్రభుత్వం ఆదాయ ధ్రువీకరణ కార్డు గా గుర్తించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. సచివాలయంలోని ఐదవ బ్లాక్ లోని ఛాంబర్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ధర్మాన. ప్రజా సమస్యల ను పరిష్కరించి ప్రజా సంక్షేమం కోసం సాయశక్తులా కృషి చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా రాష్ట్రం లో అన్ని భూ వివాదాలను కూడా సక్రమంగా పరిష్కరిస్తామని తెలిపారు.