వాళ్లని వదిలే ప్రసక్తే లేదు : శివ బాలాజీ

-

ప్రస్తుతం టాలీవుడ్ నటుడు శివ బాలాజీ.. అక్రమంగా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తోన్నారు అంటూ ప్రయివేట్ స్కూల్స్ పై న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. మణికొండలోని మౌంట్ లిటేర జీ స్కూల్… విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమంగా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు అంటూ ఆరోపణలతో మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు శివబాలాజీ. ఈ విషయంపై తాజాగా మీడియాతో మాట్లాడిన శివబాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మణికొండలోని మౌంట్ లిటేర జీ స్కూల్ ను వదిలే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరించారు. ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ఆన్లైన్ క్లాసులు పేరుతో అన్ని ప్రైవేట్ స్కూల్లలో భారీగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటు ఇప్పటికి మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన శివ బాలాజీ… తాజాగా రంగారెడ్డి జిల్లా డిఈఓ కి ఫిర్యాదు చేశారు.. కావాలనే తన పై ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. ప్రైవేట్ స్కూల్లో అక్రమాలపై పోరాటం చేస్తుంటే ఆరోపణలు చేయడం తగదు అంటూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news