సినీ హీరో నాగార్జునకు నోటీసులు..!

-

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున అన్నపూర్ణ స్టూడియో అధినేతగా.. బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ బ్యానర్ పైన ఎన్నో చిత్రాలు నిర్మించారు. మరొకవైపు ఫిలిం స్కూల్ కూడా నడుపుతున్నారు. అంతేకాకుండా హైదరాబాదులో రంగారెడ్డి జిల్లా పరిధిలో కొన్ని వందల ఎకరాలు భూమి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నాగార్జున గోవాలో కూడా ఒక బిజినెస్ మొదలు పెట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే నాగర్జునకు గోవాలోని గ్రామపంచాయతీ రాజ్ నుంచి లీగల్ నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

అసలు విషయంలోకి వెళ్తే నార్త్ గోవాలోని మాండ్రేమ్ గ్రామంలోని అశ్వవాడ వద్ద సర్వేనెంబర్ .211/2B లో అక్రమ నిర్మాణం తవ్వకం పనులు చేపడుతున్నారని అయితే ఇందుకు సంబంధించిన పనులు ఆపాలంటూ అక్కడ గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు పంపించారు. గ్రామ పరిధిలో ఈ నిర్మాణ పనుల కోసం అధికారుల నుంచి నాగార్జున సరైన అనుమతి తీసుకోలేదని అక్కడి సర్పంచ్ అమిత్ సావన్ గోవా పంచాయతీరాజ్ చట్టం కింద 1994 కింద ఆయనకు ఒక నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.

ప్రస్తుతం నాగార్జున తన 100 వ చిత్రానికి సంబంధించి కథ కోసం వెతుకుతున్నారు. ఇటీవల బిగ్ బాస్ సీజన్ -6 కి హోస్టుగా కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ సీజన్ కోసం అప్పుడే అప్డేట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే నాగార్జున బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్నారని వార్తలు కూడా చాలా వైరల్ గా మారుతున్నాయి. నాగార్జున ది ఘోస్ట్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. ప్రస్తుతం నాగార్జునకు సంబంధించి ఈ లీగల్ నోటీసుల వ్యవహారం వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news