ఏపీ, తెలంగాణ మళ్లీ ఒకటి కావు – చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం మళ్ళీ కలిసే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. ఇటీవల సజ్జల వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేస్తూ ఈ కామెంట్స్ చేశారు చంద్రబాబు. టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీకి గత వైభవం తీసుకొచ్చి.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఓ ముందడుగేశారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో టీడీపీ శంఖారావం బహిరంగ సభను నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాను తీర్చిదిద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఐటీ స్థాపించాం. అప్పట్లో సెల్‌ఫోన్‌ బువ్వ పెడుతుందా అని ఎగతాళి చేశారు.

 

ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా భార్యాభర్తలు కూడా ఉండలేరన్నారు. ఎన్టీఆర్‌ తెలుగుజాతి గౌరవాన్ని నిలబెట్టారు. తెలుగు ప్రజలకు ఆయన ఒక ధైర్యం. ఆయన విగ్రహం ముందు తీసుకున్న ఏ సంకల్పం అయినా నెరవేరుతుంది. తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా వారి అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ తెదేపా. అది తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్‌ అయినా. మీ అభిమానాన్ని గుర్తుంచుకుంటానని చంద్రబాబు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news