మరో 16, 940 పోస్టుల భర్తీ.. త్వరలోనే వరుస నోటిఫికేషన్లు

-

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలోనే మరో భారీ నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది కేసీఆర్‌ సర్కార్‌. త్వరలోనే మరో 16, 940 పోస్టులకు నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేయనున్నట్లు తెలంగాణ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ వెల్లడించారు.

ఇప్పటికే వివిధ శాఖల్లో 60, 929 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇచ్చామని సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ తెలిపారు. ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో తాజాగా భూగర్భ జలవనరుల శాఖలో 57 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటీఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. 32 గెజిటెడ్, 25 నాన్‌ గెజిటెడ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటి పూర్తి వివరాల్లోకి https://www.tspsc.gov.in/ వెబ్‌ సైట్‌ లో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news