పంచాయతీ సెక్రటరీ పోస్టులకు నోటీఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రం లోని నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్‌ సెక్రటరీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్పోర్ట్స్‌ కోటా లో 172 జూనియర్‌ పంచాయతీ సెక్రెటరీ ల పోస్టుల భర్తీ కి కేసీఆర్‌ స ర్కార్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 18 వ తేదీ.. నుంచి అక్టోబర్‌ 10 తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవ కాశం కల్పించింది సర్కార్‌.

jobs
jobs

http://www.tsprrecruitment.in/ అనే అధికారిక వెబ్‌ సైట్‌ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పోస్టుల కు అర్హతలు కూడా ప్రకటించింది. డిగ్రీ పాస్‌, స్పోర్ట్స్‌ కోటా గైడ్‌ లైన్స్‌ పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే… 18 సంవత్సరాల నుంచి 44 ఏళ్ల వయస్సు గల వారు ఈ పోస్టుల కు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది ప్రభుత్వం. 100 మార్కులకు ఒకటి చొప్పున 2 పేపర్లు ఉంటాయని.. ఒక్కో దాంట్లో 35 మార్కులు వస్తే… క్వాలిఫై అవుతారని నోటిఫికేషన్‌ లో స్పష్టం చేసింది సర్కార్‌.