ఆసిఫాబాద్.. పంటపొలాల్లో మృతదేహాల పూడిక.. అసలేం జరిగింది?

తెలంగాణ రాష్ట్రం అసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇరవై నాలుగు గంటలుగా కనిపించకుండా పోయిన ఇద్దరు వ్యక్తులు శవంగా కనిపించడం వారి కుటుంబీకులను దిగ్బ్రాంతికి గురి చేసింది. పంత పొలాల్లో ఇద్దరి శవాలు పడి ఉండడం చూసి కన్నీరు మున్నీరయ్యారు. అసిఫాబాద్ జిల్లా గన్నారం మండలంలో జరిగిన సంఘటన కలకలం రేపింది. గన్నారం గ్రామానికి చెందిన దుర్గయ్య, సత్తయ్య.. ఇద్దరూ ఇంటి నుండి బయలు దేరారు.

ఉదయం అవుతున్నా ఇంటికి చేరపోవడంతో పరిసర ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపులో వారికి అంతులేని దుఃఖం ఎదురైంది. దుర్గయ్య, సత్తయ్య.. ఇద్దరూ పంటపొలాల్లో శవాలుగా కనిపించారు. వన్యమృగాలు రాకుండా కరెంటు షాక్ పెట్టడంతో అక్కడే చనిపోయారు. ఐతే ఆ ఇద్దరినీ అక్కడే సగం వరకు పూడ్చేసారు. ఈ మేరకు పోలీసులు ప్రకటించారు.