ఎన్‌పీఎస్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా…? అయితే ఈ కొత్త రూల్ ని తెలుసుకోండి..!

-

నేషనల్ పెన్షన్ సిస్టమ్ కొత్త రూల్స్ ని తీసుకు రానుంది. ఏప్రిల్ 1, 2023 నుంచి అది అమలు లోకి రానుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. నేషనల్‌ పెన్షన్‌ అనేది పెన్షన్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌. రిటైర్‌మెంట్‌ తర్వాత పెన్షన్ అందుకోవచ్చు. ఉద్యోగం సమయంలో ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టిన దానికి మెరుగైన ఆదాయం వస్తుంది.

అలానే ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ దీన్ని నిర్వహిస్తుంది. అయితే ఇక కొత్త విషయానికి వస్తే.. నగదు విత్ డ్రా చేసుకోవడానికి కొత్త రూల్ ని తీసుకు రానున్నారు.

ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అలానే కొన్ని పత్రాలను ఇవ్వడం కూడా తప్పనిసరి. ఒకవేళ వీటిని అప్ లోడ్ చేయక పోతే ఎన్‌పీఎస్ నుంచి నగదు ఉపసంహరించుకో లేరు. పీఎఫ్‌ఆర్డీఏ వీటి మీద ఉత్తర్వులు జారీ చేసింది. చందాదారులకు కేవైసీ పత్రాలు తప్పక సబ్మిట్ చెయ్యాలి. అలానే అప్ లోడ్ చెయ్యాల్సి వుంది. నగదు విత్‌ డ్రా చేసుకునే ముందు మీరు ఎన్‌పీఎస్ ఉపసంహరణ ఫారమ్‌ను నిర్ధారించుకోవాల్సి వుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news