అమెరికా ఎన్నికల్లో వరుసగా మూడో సారి గెలిచిన ఎన్నారై…!

-

భారత సంతతికి చెందిన డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తిని వరుసగా మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నుకున్నారు. ఢిల్లీ లో జన్మించిన కృష్ణమూర్తి, లిబర్టేరియన్ పార్టీకి చెందిన ప్రెస్టన్ నెల్సన్‌ను సులభంగా ఓడించారు. ఆయనకు దాదాపు 71 శాతం ఓట్లు వచ్చాయి. 47 కృష్ణ మూర్తి తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన వారు. మొదటిసారి 2016 లో ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.

ఇక కాంగ్రెస్ సభ్యుడు అమీ బేరా కాలిఫోర్నియా నుండి వరుసగా ఐదవ విజయాన్ని నమోదు చేసారు. కాంగ్రెస్ సభ్యురాలు… మహిళ ప్రమీలా జయపాల్ వాషింగ్టన్ రాష్ట్రం నుండి వరుసగా మూడోసారి విజయం కోసం కష్ట పడుతున్నారు. కాలిఫోర్నియా మరియు వాషింగ్టన్ రాష్ట్రాలలో ఓటింగ్ ఇంకా కొనసాగుతోంది. భారతీయ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న చోట మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా మన వాళ్ళు విజయం సాధిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news