NTPCలో 864 ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు

-

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత కలిగినవారు వచ్చే నెల 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోచ్చు. మొత్తం 864 పోస్టులకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌, మెకానికల్ ఇంజీనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌, సివిల్ ఇంజినీరింగ్‌, మైనింగ్ ఇంజినీరింగ్‌ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గేట్-2022లో అర్హత సాధించిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 864

ఇందులో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌ 280 ఖాళీలు, మెకానికల్ ఇంజినీరింగ్‌ 360, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌ 164, సివిల్ ఇంజినీరింగ్‌ 30, మైనింగ్ ఇంజినీరింగ్‌లో 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో గేట్‌-2022 అర్హత సాధించి, 27 ఏళ్లలోపు వారై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: గేట్ 2022 పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్‌ 11

వెబ్‌సైట్‌: https://ntpc.co.in

Read more RELATED
Recommended to you

Latest news