‘నాటు నాటు’ పాటకు ఆస్కార్.. రామ్ చరణ్, ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే

-

ప్రపంచ సినీ యవనికపై తెలుగు సినిమా తన సత్తా చాటింది. ఇంగ్లీష్ గడ్డపై.. ఇంగ్లీష్ సినిమాలతో పోటీ పడి వాటిని వెనక్కి నెట్టి మరీ ప్రతిష్ఠాత్మక పురస్కారం ఆస్కార్​ను గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ పాట విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. దీనిపై ఆ చిత్రబృందం స్పందిస్తూ హర్షం వ్యక్తం చేసింది.

నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల ఆ పాటలో డ్యాన్స్ చేసిన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్​లు స్పందించారు. నాటునాటుకు ఆస్కార్‌పై ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ‘మేము సాధించాం. తెలుగు సినిమాకు ఆస్కార్‌ తీసుకొచ్చాం. దీని కోసం కృషి చేసిన ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి కృతజ్ఞతలు. కీరవాణి, జక్కన్న, చంద్రబోస్‌కు అభినందనలు. ఆర్‌ఆర్‌ఆర్ బృందానికి, దేశానికి అభినందనలు.’ అంటూ ఎన్టీఆర్‌ ట్వీట్ చేశారు.

‘మరోవైపు రామ్ చరణ్ కూడా ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని తెలియజేశారు. మేం గెలిచాం. ఇండియన్ సినిమాను గెలిపించాం. భారతదేశాన్ని గెలిపించాం. ఆస్కార్​ను మన ఇంటికి తీసుకొస్తున్నాం.’ అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news