సీనియర్ నటి కోసం బాల‌కృష్ణ‌కు 3 కండీష‌న్స్ పెట్టిన ఎన్టీఆర్

-

బాల‌కృష్ణ‌ కెరీర్లోలోనే దిబెస్ట్ మూవీగా చెప్పుకునే సినిమా ‘మంగమ్మగారి మనవడు’ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సూపర్ విక్టరీ సాధించింది. బాల‌కృష్ణ‌కు జోడిగా సుహాసిని… కీలకమైన మంగమ్మ పాత్రలో సీనియర్ నటి భానుమతి చేశారు. మనవడు, బామ్మ మధ్య ఉండే అనుబంధాలను చక్కగా ఆవిష్కరించారు. తమిళంలో భారతీ రాజా తీసిని ‘ మణ్ వాసనై’ సినిమాకు రీమేక్ గా కోడి రామకృష్ణ డైరెక్ష‌న్ లో మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు తెలుగులో తీశారు. ఈ సినిమాలోని ‘ దంచవే మేనత్త కూతురా..’ సాంగ్ ఆల్ టైం ఫెవరెట్ సాంగ్ గా నిలిచింది.

Bhanumathi-Telugu film popular actor

అయితే ఈ సినిమాకు అత్యంత కీలకమైన మంగమ్మ పాత్ర కోసం భానుమతిని సూచించింది సీనియర్ ఎన్టీఆర్. అయితే ఆమె ఈ సినిమా చేయకపోతే పూర్తిగా సినిమా చేయకపోవడమే మంచిదని అన్నారట ఎన్టీఆర్. తానే స్వయంగా ఫోన్ చేసి భానుమతి గారికి కథ వినిపించి ఒప్పించారు. భానుమ‌తి బహుముఖ ప్రజ్ఞాశాలి. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగి. స్టూడియో అధినేత్రిగా, రచయిత్రిగా, గాయని, సంగీత దర్శకురాలు ఇలా అన్ని రంగాల్లో నిష్ణాతురాలు. 

ఈ సినిమాకు అంతా సెట్ అయ్యాక… ఎన్టీఆర్, బాల‌కృష్ణ‌ను పిలిచి 3 విష‌యాలు చెప్పారు. వీటిని ష‌ర‌తులుగా పాటించాల‌ని ఆదేశించారు. ఒకటి భానుమ‌తి కంటే అర‌గంట ముందే షూటింగ్ వ‌ద్ద‌కు వెళ్లి రెడీగా ఉండాలి. ఏ ఒక్క రోజు కూడా నీ వ‌ల్ల ఆమె వెయిట్ చేయొద్దు. రెండోది ఆమె కార్ డోర్ నువ్వే తీయాలి. మూడు ఆమె కార్లోంచి దిగ‌గానే ఆమె కాళ్ల‌కు న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా మూడు కండీషన్లు విధించారు. ఎన్టీఆర్ విధించిన ఈషరతులను పాటించారు బాలయ్య. ఇదే కాకుండా సినిమా భారీ విజయాన్ని సాధించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news