ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ ఫైనల్…! సంజయ్‌లీలా బ‌న్సాలీ ద‌ర్శ‌కత్వంలో

-

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అతని సినిమా వస్తుంది అంటే చాలు కొందరు పని మానుకుని చూసే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం అతను ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8 న సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత తారక్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు.

ఆ సినిమా తర్వాత అతను బాలీవుడ్ సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత సంజయ్‌లీలా బ‌న్సాలీ ద‌ర్శ‌కత్వంలో హీరోగా ఎన్టీఆర్ నటిస్తార‌ని బాలీవుడ్ హీరో ర‌ణ్వీర్ సింగ్ ఇందులో విల‌న్‌గా న‌టిస్తార‌ని, వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు కూడా పెరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఒక ప్రేమ కథగా ఈ సినిమా వస్తుందని అంటున్నారు.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు ఏడాది సమయాన్ని పైగా కేటాయించే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. బన్సాలి ఈ సినిమా కథను లాక్ డౌన్ పూర్తి అయ్యే లోపు పూర్తి చేసే సూచనలు కూడా ఉన్నాయని అంటున్నారు. 2021 చివర్లో లేదా 2022 మొదట్లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news