పెళ్లి చూపులు డైరెక్టర్ తో ఎన్టీఆర్…!

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో దూకుడు చూపిస్తున్నాడు. ఒకపక్క సంక్రాంతికి రిలీజ్ కాబోయే ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉంటూనే, మరోపక్క త్రివిక్రమ్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ‘అయిననూ పోయిరావలె హస్తినకు`అనే సినిమా చేయడానికి ఒకే చెప్పాడు. రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న వెంటనే త్రివిక్రమ్ సినిమాతో బిజీ అవ్వబోతున్నాడు.

ఇంతలోనే మరో అవకాశం ఎన్టీఆర్ ముందుకు వచ్చిందట. ఈ మధ్య కాలంలో పెళ్లిచూపులు సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఎన్టీఆర్‌కు కథ చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు కూడా కథ నచ్చిందట. కథ కూడా ఆసక్తికరంగా ఉండటం తో ఈ సినిమా ఒకే చెయ్యొచ్చు అని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్. అయితే దీనిపై తారక్ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని తెలుస్తోంది.

సుకుమార్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఆ సినిమా చేస్తాడా ఈ సినిమా చేస్తాడా అనేది స్పష్టత రావడం లేదు. ట్రిపుల్ ఆర్ సినిమా జనవరి 8 న ప్రేక్షకుల ముందుకి రానుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను ఎలా అయినా సరే విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ పట్టుదలగా ఉంది. ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. 80 శాతంపైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news