కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి ఎవరి సహాయ౦ వాళ్ళు చేస్తున్నారు. సినీ తారలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, క్రీడాకారులు అందరూ కూడా తమ వంతు సహాయ౦ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 1700 మందికి దేశంలో కరోనా వైరస్ సోకింది.
వారిలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా సోకిన అన్ని రాష్ట్రాల్లో కూడా మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం చేస్తూ వస్తుంది. ప్రజలను ఆదుకోవడానికి ముందుకి వస్తూ ఆర్ధిక ప్యాకేజి ప్రకటిస్తుంది. దీనికి అందరూ తమ వంతుగా చేయూత ఇస్తున్నారు. సినీ హీరోలతో పాటుగా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు సాయం చేస్తున్నారు.
టాటా రిలయన్స్ సహా పలు సంస్థలు ఇప్పుడు సాయం చేస్తున్నాయి. టాటా 1500 కోట్లు సహాయం చేయగా రిలయన్స్ 500 కోట్ల రూపాయల సహాయం ప్రకటించింది. ఇక ఇప్పుడు విప్రో తమ వంతుగా సాయం చేసింది. విప్రో, అజీం ప్రే౦ జీ ఫౌండేషన్ 1125 కోట్ల రూపాయల సాయం చేసింది. దీనిని వైద్య సేవలు మెరుగు పరిచేందుకు గాను వినియోగించాలని విప్రో కోరింది.