బుచ్చిబాబుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్న‌ల్‌.. కానీ వెయిట్ చేయాల్సిందే

-

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున ఆయ‌న సినిమాల‌కు సంబంధించి అప్‌డేట్లు బాగానే వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఆర్ ఆర్ ఆర్ నుంచి ప‌వ‌ర్‌ఫుల్ లుక్ విడుద‌ల‌యింది. అలాగే కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌నీల్ కూడా ఎన్టీఆర్‌తో 31వ సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు అంద‌రూ ఎంత‌గానో ఎదురుచూస్తున్న మ‌రో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ప‌డింది.

ఉప్పెన సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన డైరెక్ట‌ర్ బుచ్చిబాబుతో సినిమా ఉంటుంద‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ అవేవీ లేవ‌ని మ‌ధ్య‌లో తెలిసింది. అయితే సినిమాపై ఈ రోజు బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు.

ఎన్టీఆర్ కు ఫేస్‌బుక్‌లో విషెస్ తెలుపుతూ ఇలా రాసుకొచ్చారు. ‘హ్యాపీ బర్త్ డే నందమూరి తారక రామారావు గారు. వెయిటింగ్ సార్. లోకల్ స్టోరీని ప్రపంచవ్యాప్తంగా చెప్పి ట్రెండ్ సృష్టిద్దాం అంటూ ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుంద‌ని క్లారిటీ ఇచ్చాడు. కానీ ఆర్ ఆర్ ఆర్, కొర‌టాల శివ మూవీ, ప్ర‌శాంత్ నీల్ మూవీ అయిపోయాకే వీరి సినిమా ఉంటుంద‌న్న‌మాట‌.

Read more RELATED
Recommended to you

Latest news