ఇప్పుడు సినిమా షూటింగ్ లు అన్నీ కూడా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఒక్క సినిమా షూటింగ్ కూడా ఇప్పట్లో జరిగే అవకాశం కనపడటం లేదు. లాక్ డౌన్ ఎత్తేసినా సరే సినిమా షూటింగ్ లు మొదలయ్యే అవకాశం లేదు. ఒకవేళ మొదలైనా సరే లాక్ డౌన్ ఉండటంతో చాలా పరిమితంగానే షూటింగ్ లు చేసే అవకాశం ఉంటుంది. దీనితో దర్శకులు అందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తలు పడుతున్నారు.
ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ సినిమాను మొదలుపెట్టే అవకాశం కనపడట౦ లేదు. లాక్ డౌన్ కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడింది. మొదలైనా సరే లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి త్రివిక్రమ్ అప్పటి వరకు ఖాళీ గా ఉండటమే. దీనితో ఒక చిన్న సినిమాను ప్లాన్ చేస్తున్నాడట.
నానీ లేదా నాగ చైతన్య తో ఒక చిన్న సినిమాను తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ ఒక కథను రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు నానీ కూడా ఓకే చెప్పాడని టాక్. ఆర్ఆర్ఆర్ లేట్ అయితే గనుక వచ్చే ఏడాది మే వరకు దాదాపుగా ఎన్టీఆర్ ఖాళీ గా ఉండే అవకాశం లేదు కాబట్టి రెండు మూడు నెలల్లో సినిమాను పూర్తి చేసే సినిమాను ప్లాన్ చేస్తున్నాడట.