మహేష్ జక్కన్న సినిమాలో ఆసక్తికర చర్చ ఇదే…!

-

టాలీవుడ్ లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ వస్తున్న కాంబినేషన్ రాజమౌళి మహేష్ బాబు. వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పటి నుంచో వస్తుంది అనే ప్రచారం జరుగుతుంది గాని అది పట్టాలు ఎక్కే అవకాశం ఇన్నాళ్ళు కనపడలేదు. అయితే జక్కన్న ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ తో తాను సినిమా చేస్తాను అని ప్రకటించారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రకటన వచ్చింది.

అయితే ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్న చర్చ ఒక్కటే. ఈ సినిమాకు నిర్మాతలు ఎవరూ… రాజమౌళి ఒకరి పేరు చెప్పారు గానీ ఆయన పూర్తిగా నిర్మాత కాదు. మరో నిర్మాత ఎవరు అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య కాలంలో మహేష్ తో సినిమా చేయడానికి గానూ ఏ నిర్మాత కూడా ముందుకు రావడం లేదు. ఆయన తో సినిమా చెయ్యాలి అని ఉన్నా సరే మహేష్ డిమాండ్ లు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు.

ఇప్పుడు ఎవరు సినిమా చేస్తారు అనేది స్పష్టంగా తెలియడం లేదు. మహేష్ కమర్షియల్ గా ఆలోచించడం ఇప్పుడు నిర్మాతలకు బాగా ఇబ్బంది పెడుతుంది. అయితే ఈ సినిమాలో పెట్టుబడి పెట్టే నిర్మాతలతో మహేష్ కి ఎలాంటి సంబంధం ఉండదు అని రాజమౌళి మహేష్ ని నిర్మాత అయితే సినిమా చేసే అవకాశం లేదని… అందుకే ఇప్పుడు నిర్మాత విషయంలో రాజమౌళి నే జోక్యం చేసుకుని తీసుకోస్తారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news