ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబో సినిమాకి క్రేజీ టైటిల్.. అ సెంటిమెంట్ పక్కకి పెట్టినట్టే.

-

అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న త్రివిక్రమ్, తన తర్వాతి సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో ప్రకటించాడు. ఐతే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. కరోనా లేకపోయుంటే ఈ పాటికి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా మొదలయ్యుండేదే. కానీ కరోనా వచ్చి ఎనిమిది నెలలపాటు ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ వాయిదా పడడంతో ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబో సినిమా పట్టాలెక్కడం ఆలస్యం కానుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా టైటిల్ విషయమై అనేక విషయాలు ప్రచారంలో ఉన్నాయి.

అయినను పోయి రావలే హస్తినకు అనే టైటిల్ బాగా ప్రచారంలో ఉన్న మాట అందరికీ తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ తన సినిమాకి “అ” సెంటిమెంట్ ని పక్కన పెడుతున్నట్లు తెలుస్తుంది. ఫిలిమ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న దాని ప్రకారం రాజా వచ్చినాడు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, రాజా వచ్చినాడు అనే టైటిల్ బాగా ప్రచారంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news