1998నుండి బీజేపీలో ఉండి తెలంగాణ కోసం పోరాడింది తానే అన్నారు బీజేపీ నేత విజయ శాంతి.బీజేపీ లో ఉండి తెలంగాణ కోసం పోరాడాను..తెలంగాణ ని టీడీపీ వ్యతిరేకించింది. తప్పని పరిస్థితి లో బీజేపీ ని వీడాను.. ఆ సమయంలో చాలా బాధ పడ్డా అన్నారు. మంత్రి పదవి ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమం లోకి వచ్చిన వ్యక్తి కేసీఆర్ అని ఆమే అన్నారు. తాను సొంతగా తల్లి తెలంగాణ పార్టీ పెట్టాకే కేసీఆర్ దొర ఉద్యమంలో ఎంటరయ్యారన్నారు. నన్ను పార్టీలోకి ఆహ్వానించి నరేంద్ర గారిని నా ఇంటి చుట్టు పదుల సార్లు తిప్పాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. నా కన్నా గొప్ప నటుడు కేసీఆర్ అని తెలిపిన ఆమె బీజేపీలో ఉన్నప్పుడు నన్ను సోనియా మీద పోటీ చేయాలని కోరారు అని పేర్కొంది.
తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అని సోనియాకి ఆఫర్ ఇచ్చి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు అందుకే ఇప్పటి వరకు కేసీఆర్ ని భరించారు. ఇక భరించే పరిస్థితి లో లేరు. కేసీఆర్ ఇక ఉండడు , కరెక్ట్ పార్టీ వచ్చింది అన్నారు. ప్రతి దానికి డబ్బులు .. డబ్బులు లెక్కలేస్తున్న దొరకి అప్పుడు రాఖీ కట్టిన పైసలిచ్చే సీన్ లేదన్నారు. ఉద్యమ సమయంలో నన్ను పదో చెల్లె అంటూ రాఖీ పౌర్ణమి కి నా దగ్గరికి వస్తా అన్నా మనిషి సాయంత్రం వరకు ఎదురు చూసిన రాలేదన్నారు. మీకు ఇవ్వడానికి 10వేల కోసం ఆగాడు అంటూ సంతోష్ చెప్పిన మాటలు ఇనాటికి తనకు గుర్తే అన్నారు విజయశాంతి. నేను ఎంపీగా గెల్చినప్పటి నుండి నన్ను లేకుండా చేయాలని కేసీఆర్ చేశాడు. అప్పటి సీఎం వైఎస్ ని నియోజక అభివృద్ది విషయం పై కలిస్తే నేను కాంగ్రెస్ లో చేరుతున్నారని దుష్ప్రచారం చేయించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టినప్పుడు ఉంది నేనే.. కేసీఆర్ ఆ రోజు కూడా లేడన్నారు విజయశాంతి.