గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమానికి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు.
నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థపై కొరటాల శివ సన్నిహితులు మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
తారక్ కొబ్బరికాయ కొట్టి పూజను ప్రారంభించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎన్టీఆర్, కొరటాల శివకు ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. ఎన్టీఆర్, జాన్వీపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి రాజమౌళి క్లాప్ కొట్టారు. హిందీ నిర్మాత, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, ఇతరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.