పాకిస్తాన్ అణు పితామహునిగా పిలువబడుతున్న అబ్దుల్ ఖాదీర్ ఖాన్( A.Q ఖాన్ ) మరణించారు. 85 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో మరణించారు. పాకిస్తాన్ ను అణు దేశంగా మార్చడంలో A.Q ఖాన్ ప్రధాన పాత్ర పోషించారు. 1936 భోపాల్ లో జన్మించిన ఆయన దేశ విభజన సందర్భంగా 1947లో పాకిస్తాన్ కు కుటుంబంతో సహా వలస వెళ్లారు. 90 వ దశకంలో పాక్ లో నిర్వహించిన అణు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. ఆ తరువాత అణు సమాచారాన్ని ఇరాన్, లిబియా, నార్త్ కొరియా దేశాలకు అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణ నేపథ్యంలో 2004 నుంచి ఇస్లామాబాద్లో ప్రభుత్వ సెక్యూరిటీ ఆధీనంలో ఉన్న ఇంట్లో నిర్భందంలో ఉంటున్నారు. తాజాగా ఊపిరితిత్తుల వైఫల్యంతో మరణించారు. A.Q ఖాన్ మరణం పాకిస్తాన్ కు తీరని లోటు అని అక్కడి రాజకీయ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.