కరోనా వైరస్ బారిన పడి ప్రముఖ వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా బారిన పడిన అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్, ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ శేఖర్ బసు గురువారం కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 68 ఏళ్ళు. 2014 లో పద్మశ్రీ అవార్డు పొందిన డాక్టర్ బసు కోవిడ్ -19 మరియు ఇతర మూత్రపిండాల అనారోగ్యంతో బాధపడుతున్నారని జాతీయ మీడియా పేర్కొంది.
ఆయన గురువారం తెల్లవారుజామున 4.50 గంటలకు కన్నుమూశారు. మెకానికల్ ఇంజనీర్ అయిన డాక్టర్ బసు దేశం యొక్క అణు ఇంధన విషయంలో చేసిన కృషికి గానూ ఆయనకు పద్మ శ్రీ అవార్డ్ దక్కింది. కాగా ఇటీవల పలువురు కేంద్ర మంత్రులు కూడా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.