NZ vs BAN: చెన్నై పిచ్ లో స్పిన్నర్లదే రాజ్యమా ?

-

మరికాసేపట్లో చెన్నైలోని చెపాక్ స్టేడియం లో న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్ ల మధ్యన మ్యాచ్ జరగనుంది. రెండు టీం లో షెడ్యూల్ లో భాగంగా రెండు మ్యాచ్ లను పూర్తి చేసుకోగా, కివీస్ అపజయం ఎరుగని టీం గా ముందుకు దూసుకుపోతోంది, అదే సమయంలో బంగ్లా మాత్రం మొదటి మ్యాచ్ లో గెలిచినా రెండవ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ముందు తలవంచక తప్పలేదు. ఈ మ్యాచ్ లో విజయమే లక్ష్యంగా షకిబుల్ సేన అడుగులు వేస్తోంది. కాగా చెన్నై లో గత ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా స్పిన్ కు ఆడలేక చేతులెత్తేసింది.. మొత్తం స్పిన్నర్లు ఆరు వికెట్లు తీసుకుని ఆస్ట్రేలియాను దెబ్బతీశారు. దీనిని ఆధారంగా చేసుకుని చూస్తే ఈ రోజు పిచ్ కూడా ఎక్కువగా స్పిన్నర్లకే సహకరిస్తుందని క్రికెట్ విశ్లేషకుల బలమైన అభిప్రాయం.

అలా చూస్తే… బంగ్లాకు షకీబ్, మెహిదీ హాసన్ మిరాజ్, మహేది హాసన్ ల రూపంలో క్వాలిటీ స్పిన్ ఉండగా, కివీస్ కు కూడా సోధీ, రవీంద్ర, ఫిలిప్స్ రూపంలో మంచి స్పిన్నర్లు ఉన్నారు. మరి ఈ మ్యాచ్ కూడా స్పిన్నర్లకే అగ్రతాంబూలం ఇస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news