NZ VS SL : సిరీస్ గోవిందా… డిసైడర్ లో చేతులెత్తేసిన లంక !

-

న్యూజిలాండ్ వేదికగా జరిగిన మూడు వన్ డే ల సిరీస్ లో శ్రీలంక మరియు న్యూజిలాండ్ లు ఆఖరి మ్యాచ్ వరకు సిరీస్ కోసం పోటాపోటీగా తలపడ్డాయి. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ లంక సూపర్ ఓవర్ లో కివీస్ పై గెలుపొందగా , రెండవ మ్యాచ్ మాత్రం ఏకపక్షముగా సాగి కివీస్ ను విజయం వరించింది. ఇక ఈ రోజు ఉదయం జరిగిన సిరీస్ డిసైడర్ లో ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది, లంక బ్యాటింగ్ లో నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి
182 పరుగులు చేసింది.

కుశాల్ మెండిస్ 73 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ మరొక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చెందించి సిరీస్ ను 2 – 1 తేడాతో కైవసం చేసుకుంది. కివీస్ బ్యాటింగ్ లో ఓపెనర్ సీపర్ట్ కేవలం 48 బంతుల్లోనే 10 ఫోర్లు మరియు 3 సిక్సులతో 88 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news