ఐకాన్ స్టార్​తో పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ సందడి

-

IPL 2023 వచ్చేసింది. క్రికెట్ అభిమానులంతా ఈ సీజన్​ మ్యాచ్​లు చూడటంలో ఫుల్ బిజీ అయ్యారు. జట్లు కూడా హోరాహోరీగా పోరాడుతున్నాయి. గతంలోని చేదు అనుభవాలు గుర్తుపెట్టుకుని మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తున్నాయి. ఈ సీజన్​లో పంజాబ్‌ కింగ్స్‌ వరుస విజయాలను అందుకుంటోంది. దీంతో ప్రస్తుతం ఫుల్​ జోష్​లో ఉన్న ఆ జట్టు.. తన తదుపరి మ్యాచ్​ను ఏప్రిల్‌ 9న హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో పోటీ పడనుంది.

ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఈ జట్టు.. ఇవాళ తమ ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొనుంది. ఈ క్రమంలోనే పంజాబ్‌ ప్లేయర్స్​.. రాహుల్‌ చాహర్‌, హర్‌ప్రీత్ బ్రార్.. టాలీవుడ్‌ ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్‌ను కలిశారు. కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్​తో కలిసి ఈ ఇద్దరు క్రికెటర్లు ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోను రాహుల్​ చాహర్​​​ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీన్ని చూసిన నెటిజన్లు తెగ షేర్​ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news