అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక కొత్త పుస్తకాన్ని రాసి విడుదల చేశారు. ఎ ప్రామిస్డ్ ల్యాండ్ పేరుతొ మార్కెట్‌లోకి విడుదలైన ఈ పుస్తకానికి అక్కడ యమా డిమాండ్ ఏర్పడింది. ఈ పుస్తకంలో ఆయన భారత్ సహా పలు దేశాలతో అమెరికాకు ఉన్న సంబంధాలు, ఆయా దేశాల లీడర్స్ గురించి ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పుస్తకంలో ఇండియాతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
రాహుల్ గాంధీపై ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అదేంటంటే రాహుల్ గాంధీ.. హోమ్‌వర్క్‌ను అందరి కంటే ముందే పూర్తి చేసుకుని, టీచర్‌ను ఇంప్రెస్ చేయాలనుకునే విద్యార్థి లాగా అనిపించాడని ఒబామా ఈ పుస్తకంలో రాసుకోచ్చారు. ఈ క్రమంలో ఆ విద్యార్థి తనకు ఇచ్చిన హోమ్ వర్క్ పూర్తి చేస్తున్నాడు కానీ ఆ హోం వర్క్ చేసిన సబ్జెక్ట్ మీద కూడా ఆయన పట్టు సాధించలేకపోతున్నారని పేర్కొన్నాడు. అలానే ఆ సబ్జెక్ట్‌పై పట్టు సాధించడానికి రాహుల్ గాంధీ చేయాల్సింది చాలా ఉందని ఆయన పేర్కొన్నాడు. నెర్వస్, అన్ ఫార్మ్‌డ్ క్వాలిటీ ఆయనలో ఉన్నాయని వాటిని అధిగమించాలని ఆయన పేర్కొన్నారు.